విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ‘తరగతి గది-ఏ దేశ భవిష్యత్తు’ లక్ష్యం
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే 'తరగతి గది-ఏ దేశ భవిష్యత్తు' లక్ష్యం అని గొట్టిముక్కుల మాధవాచారి తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 30 : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, వారికి నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడం, మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లు, ఇతర వ్యసనాలకు బానిసలు కాకుండా చైతన్యపరచడమే ‘తరగతి గది – ఏ దేశ భవిష్యత్తు’ కార్యక్రమ లక్ష్యమని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ (HRPWAO) జాతీయ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు గొట్టిముక్కుల మాధవాచారి, జాతీయ కార్యదర్శి మాధవి భైరి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవనీత్ జినుకల, ప్రముఖ ప్రజా కళాకారులు బుల్లెట్ వెంకన్న ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఆటలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రేరణాత్మక సందేశాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలకు తీసుకెళ్లి విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు సంస్థ కృషి చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రారంభించి, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, సామాజిక సేవకులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

