నర్సింహులపేట, జనవరి 13 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కేజీకేఎస్ మండల అధ్యక్షులు డొనికెన రామన్న, రాష్ట్ర కమిటీ సలహాదారు గునిగంటి మోహన్ తో కలిసి స్థానిక ఎస్సై సురేశ్ కేజీకెఎస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేజీకెఎస్ మండల అధ్యక్షుడు రామన్న మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులందరికి రూ.4వేల పించన్లు పెంచి ఇవ్వాలన్నారు.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన గీత కార్మికులకు అందరికీ పెన్షన్స్ వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెలమల్ల యాదగిరి, రవి, ప్రభాకర్, ఉప సర్పంచ్ డొనికెన రాంముర్తి, ఉపేందర్, సీతారాములు, రమేష్, వెంకన్న దొంతు రాంముర్తి, చెలమల్ల వెంకన్న, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.