కమలాపూర్, జూన్ 4: మాజీ మంత్రి ఈటల రా జేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్రం వచ్చిందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమలాపూర్, హుజురాబాద్ ని యోజకవర్గాల్లో 18ఏళ్ల పాటు ఈటల పార్టీ నాయకులను ఎదుగకుండా అణగదొక్కాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తే ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రామస్వామి, టీఆర్ఎస్ నాయకులు చెరిపెల్లి రాంచందర్, కొలిపాక సాంబయ్య, పోరం డ్ల రమేశ్, రావుల సమ్మయ్య, కే రవి, పింగి ళి రంజిత్‌రెడ్డి, కృష్ణమూర్తి, సుధాకర్ పాల్గొన్నారు.