Arts College | ఆర్ట్స్ కాలేజీలో అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ప్రారంభం
క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 27: క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం అన్నారు. మంగళవారం కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని, విద్యార్థులు నిరంతరం సాధన చేస్తూ తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కేయూ క్రీడావిభాగం కార్యదర్శి శాస్త్రి, కేయూ క్రీడా విభాగ అధ్యాపకులు ఏ.టి.బి.టి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, సహాయ రిజిస్ట్రార్ సునీల్, భూక్య రాజు, వివిధ కళాశాలల క్రీడా విభాగ అధ్యాపకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

