– పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
– ఆదివారం ఘనంగా పోచ్చమ్మ తల్లి పునఃప్రతిష్ఠాపన
ఐనవోలు, ఆగస్టు 09 : హనుమకొండ ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఒంటిమామిడిపల్లి హనుమాన్ గుడి సెంటర్లో దాత, మాజీ ఎంపీటీసీ కడ్డూరి రాజు – మమత దంపతులు ఆర్థిక సహకారంతో (సుమారు రూ.3 లక్షలతో) ఏర్పాటు చేసిన 13 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన వేదపండితులు ఐనవోలు మల్లికార్జునశర్మ, కార్తీక్ శర్మల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణాల నడుమ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆడెపు దయాకర్ – స్రవంతి దంపతులు పునర్ నిర్మాణం చేయించిన పోచ్చమ్మ తల్లి ఆలయ పూజలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిని రాజు దంపతులు ఘనంగా సన్మానిచారు. ఈ పూజా కార్యక్రమంలో నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తంపుల మోహన్, మాజీ ప్రజా ప్రతినిధులు మునిగాల సంపత్ కుమార్, అడెపు దయాకర్, పెండ్లి తిరుపతి, కొట్టం రాజు, సతీశ్, వెంకన్న, నాయకులు తిరుపతిరెడ్డి, సంపత్, రాజు, సునీల్, రాజు, డీడీ, కేకే, విక్రమ్, మల్లారెడ్డి, రఘువంశీ, రమేశ్, సంపత్, గ్రామస్తులు పాల్గొన్నారు.