హనుమకొండ చౌరస్తా, జులై 5: ఈనెల 6న(ఆదివారం) హనుమకొండ జిల్లా జూనియర్స్ అండర్-18 బాలబాలికల బాస్కెట్‌బాల్ జట్టు ఎంపికలు కాజీపేట ఫాతిమానగర్‌లోని మాన్‌ఫోర్ట్ సీబీఎస్ఈ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు బాస్కెట్‌బాల్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి రాజు, ప్రధాన కార్యదర్శి డోలి సాంబయ్య తెలిపారు.
జూనియర్స్ అండర్-18 బాలబాలికల సెలక్షన్ ట్రైల్స్‌లో పాల్గొనే క్రీడాకారులు 6న ఆదివారం సాయంత్రం 5 గంటలకు మాన్‌ఫోర్ట్ సీబీఎస్ఈ స్కూల్ బాస్కెట్‌బాల్ మైదానంలో హాజరుకావాలని, 1-1-2007 తర్వాత పుట్టిన క్రీడాకారులు మాత్రమే అర్హులని, క్రీడాకారులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్‌కార్డు, జనన ధృవీకరణ పత్రం(ప్రభుత్వం జారీ చేసినది)తో హాజరుకావాలని సూచించారు. ఈ సెలక్షన్ ట్రైల్స్ సెలక్ట్ అయిన క్రీడాకారులు అండర్-18 బాలబాలికలు ఈనెల 11 నుంచి 13 వరకు గద్వాల్ ఉత్తానూర్లో జరగనున్న జూనియర్ బాస్కెట్‌బాల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు కోచ్ ఎండి.ఇర్ఫాన్‌ను 83284 49263 నెంబర్లో సంప్రదించాలని కోరారు.