హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: వికాస తరంగణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిచే నేటి నుంచి వచ్చే సంవత్సరం ఆగస్టు 14 వరకు ఆరెపల్లిలోని ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు డాక్టర్ తిప్పని అవినాష్, శ్రీమాన్ దయాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.
ఈ క్యాంపులో ఉచిత కన్సల్టేషన్, పరీక్షలు, వైద్యం అందించబడుతుందని, రొమ్ములో, శరీరంలో, కణతులు, నోటిలో, గొంతులో ఏ పుండు అయినా, దీర్ఘకాలిక అల్సర్, కడుపునొప్పి, కామెర్లు, దమ్ము, దీర్ఘకాలిక దగ్గు, మందులకు తగ్గని తలనొప్పి, నడుమునొప్పి, మూత్రము, మలములో రక్తం పడుట ఎర్రబట్ట, తెల్లబట్ట అధికముగా అవడం, చంకలో, మెడలో గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గొంతులో మార్పు, ఎక్కడైనా గడ్డలు తగులుట, తరచు అలసట, జ్వరం రావడం వంటి లక్షణాలతో బాధపడుచున్నవారు ఈ క్యాంపులో పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ బచ్చ రాధాకృష్ణ, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎలగందుల రాజేందర్ , తిరుమల్‌రావు, మాలాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇతర విరాలకు 98495 70399, 97041 12989, 92468 96400, 9704469222 9345108108, 0870-6391 3333 నెంబర్లను సంప్రదించాలని కోరారు.