నర్సింహులపేట మే 2 : 25 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకువచ్చినప్పటికీ వడ్లు కాంటా పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన అంకం రామకృష్ణ అనే రైతు తన ధాన్యాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతు రామకృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సిబ్బంది 500, 1000 రూపాయలు ఇచ్చిన వారి ధాన్యం తేమశాతం పట్టింపు లేకుండా కాంటాలు పెడుతున్నారని ఆరోపించారు.
కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం పోస్తే 25 రోజుల నుండి కాంటాలు పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారని విమర్శించారు. పదవి ఉన్నవారు పైరవీ చేసే వారికి మాత్రమే కాంటాలు పెడు తున్నారని, ఏవో అందుబాటులో ఉండడం లేదని దీంతో టోకెన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని నిబంధన ప్రకారం కాంటా నిర్వహించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.