హనుమకొండ, అక్టోబర్ 8: ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-17 ఇయర్స్బాలబాలికల బాక్సింగ్ స్కూల్ గేమ్స్టోర్నమెంట్ కం సెలక్షన్ హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లోని బాక్సింగ్ హాల్లో ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హనుమకొండ డీవైఎస్వో గుగులోతు అశోక్‌కుమార్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఇందులో సుమారు 150 మంది బాలబాలికలు పాల్గొని వారి ప్రతిభను కనబర్చారని హనుమకొండ ఎస్జీఎఫ్ఐ సెక్రెటరీ వెలిశెట్టి ప్రశాంత్ తెలిపారు.
అండర్ 17 ఇయర్స్బాయ్స్అండ్ గర్ల్స్కన్వీనర్గా శీలం పార్థసారధి వ్యవహరించారు. ఇక్కడ ప్రతిభ కలిగిన క్రీడాకారులు హనుమకొండలో జరిగే రాష్ర్టస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డివైఎస్ఓ రఘు, భోగి సుధాకర్, మాజీ ఒలంపిక్స్సెక్రటరీ స్వామిచరణ్, వివిధ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్స్ ఆర్.సుభాష్‌కుమార్, సురేష్, ప్రేమ్, ప్రేమానందం, నాగరాజు, మనోహర్, లక్ష్మణ్, మమత, రాజేశ్వర్, సీనియర్ బాక్సర్ ప్రభాకర్, శీలం నరేంద్రదేవ్, సాంసంగ్, ప్రభుదాసు పాల్గొన్నారు.