వేలేరు : విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా కష్టపడి చదివి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి, పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని దాత రఘునాయకుల ప్రమోద్ రెడ్డి సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. దాత ప్రమోద్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు సభ్యులు ఒద్దుల శ్రీకాంత్, దామెర నరేష్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమ శిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునని అన్నారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, పరీక్ష సమయాన్ని సక్రయంగా వినియోగించుకోవాలన్నారు. పాఠశాల హెచ్ఎం శ్రీదేవి ఉపాధ్యాయులు దయాకర్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.