వేలేరు : హనుమకొండ జిల్లా వేలేరు మండల పరిధిలోని మల్లికుదుర్ల శివారులో దేవాదుల పైపులైన్‌కు (Devadula pipeline) లీకేజీ ఏర్పడింది. పైప్ లైన్ లీకేజీతో నీరు పైకి ఎగిసిపడుతూ ఆకాశానంటుతున్నట్లు కనిపిస్తున్నది. పైప్ లైన్ లీకేజీతో నీరు వృధాగా పోతుంది.
సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే మల్లికుదుర్ల పక్క రైతులు వారి పంట పొలాలకు సాగునీరు అందించేందుకే దేవాదుల పైప్ లైన్‌కు లీకేజీ చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.