రుద్రేశ్వరిదేవిని తామరపూలతో పూజించి భవానిదేవిగా అలంకరణ
తామరపూలతో అలంకరించి రుద్రేశ్వరిదేవిని భవానీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 16 : చారిత్రిక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు తామరపూలతో అలంకరించి రుద్రేశ్వరిదేవిని భవానీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. దద్దోజనం నివేదన సమర్పించి నీరాజనా మంత్రపుష్పాలు అనంతరం 300 మంది బ్రాహ్మణ మహిళలకు మూలనక్షత్రాన్ని పురస్కరించుకొని చీర, బొట్టు, గాజులు, తాంబూలాలతో అందజేశారు. అనంతరం 7, 10వ డివిజన్‌లోగల బ్రాహ్మణ మహిళలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి-నీలిమ దంపతులు, నాయిని రాజేందర్ రెడ్డి తల్లిదండ్రులు నరేందర్‌రెడ్డి-జయమాల బ్రాహ్మణ మహిళలకు వస్త్రదానం చీరలు పంపిణీ చేశారు.
ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవియాదవ్, కోన శ్రీకర్, పల్లం రమేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులు యాగశాలలో గణపతి నవగ్రహ రుద్ర సహిత జయాధి సహిత 18 సప్తశతి అధ్యాయాలతో మహాచండీయాగం తెల్ల ఆవాలు తోక మిరియాలు రక్త చందనం శ్రీగంధం తదితర సుగంధ ద్రవ్య పరిమళాలతో మహా చండీయాగం నిర్వహించారు. అనంతరం భవానీదేవికి వాహనసేవ నిర్వహించారు. ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ, భరత్‌శర్మ దత్త కుమారశర్మ, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

