వరంగల్ : శాంతి భద్రతల పరిరక్షణ పరిరక్షణలో భాగంగా మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ అలియాస్ కోతి సురేష్ ను(31) వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి బహిష్కరిస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మీల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.ఐ మిథున్ నిందితుడు కోతి సురేష్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో ఉత్తర్వులను అందజేశారు. సురేష్ పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి.
కాగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు (6) నెలలు బహిష్కరించారు. కోర్టు హాజరు కోసం మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం అందించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.