హనుమకొండ చౌరస్తా, జూలై 31: బహుజన పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తితో వారి జయంతి వర్ధంతిలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న బహుజన వర్గాలు సన్నద్ధం కావాలని బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ రాష్ర్ట అధ్యక్షుడు రావుల సుదర్శన్ కోరారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొరలకు పెత్తందారులకు వ్యతిరేకంగా భూపోరాటం చేసి లక్షలాది ఎకరాల భూమిని విముక్తి కలిగించి లబ్ధిదారులకు అందేలా కృషి చేసిన నిప్పు కనిక చిట్యాల ఐలమ్మ అన్నారు.
ఆమె వర్ధంతి సెప్టెంబర్ 10, జయంతి సెప్టెంబర్ 26న ఘనంగా నిర్వహించడమేగాక గత 15 సంవత్సరాలుగా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఫౌండేషన్ తరఫున ఈ సంవత్సరం నుంచి బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్ నుంచి బహుజన పోరాట యోధులకు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 10లోగా 93466 09446, 63029 29985 లకు దరఖాస్తులు పంపించాలని, పరిశీలించి వారికి సెప్టెంబర్ 26 చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా అవార్డులు ప్రధానం చేయనున్నట్లు వారు తెలిపారు. రాష్ర్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాలడుగుల సురేందర్, ఫౌండేషన్ బాధ్యులు చీకటి వీరస్వామి, శ్రీనివాస్ యాదవ్, కక్కెర్ల హరిగౌడ్, నాగపురి సంతోష్ పాల్గొన్నారు.