హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 8: ఆర్ట్స్ కాలేజీలో ఐసీటీ అండ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ‘ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్’లో బీకాం విద్యార్థులు విజయవంతమయ్యారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్సూరెన్స్) విభాగానికి చెందిన ‘ప్రీమియర్ బ్యాంకర్’ కోర్సును పూర్తి చేసి విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారు.
బీకాం ఫైనల్ ఇయర్‌కు చెందిన మొత్తం 65 మంది విద్యార్థులు ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఈ ట్రైనింగ్‌లో పలువురు విద్యార్థులు ఏ+ గ్రేడ్ సాధించారని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి ఎల్.జితేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, బీకాం విభాగాధిపతి స్వామి, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.