భీమదేవరపల్లి, జూన్ 29: ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథ రెడ్డి సేవలు మరువలేనివని ప్రస్తుత అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం ప్రధాన కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు కాశీ విశ్వనాధ రెడ్డి 39 వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సభ్యుల పరస్పర సహకారం వల్లనే సహకార సంఘం దినదినాభివృద్ధి చెందుతుందన్నారు.
అయితే ఆనాటి కాలంలో సహకార సంఘం స్థాపనకు ఎంతోమంది కలిసి బీజం వేశారని గుర్తు చేశారు. కేవలం 375 మంది సభ్యులతో ప్రారంభమైన సహకార సంఘం ఆర్థికంగా నిలబెట్టేందుకు వ్యవస్థాపక అధ్యక్షులు కాశీ విశ్వనాథరెడ్డి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధి లో కాశీ విశ్వనాథరెడ్డి సేవలు మరువలేమనన్నారు. అంతకుముందు సంఘ సీనియర్ సభ్యులు కటకం లక్ష్మీ నారాయణ, మాడిశెట్టి తారాబాయి విశ్వనాథ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం ఉపాధ్యక్షులు కడారి ఆదాం, డైరెక్టర్లు కూన కనకయ్య, మారుపాటి జయపాల్ రెడ్డి, కంకల భాగ్య, గజ్జి వీరయ్య, అంబాల రాములు, ఈర్ల మూగయ్య, బేల కనకమ్మ, కంది రవీందర్ రెడ్డి, మండ శ్రీనివాస్, చవ్వల్ల బుచ్చయ్య, గుగులోతు భాషు, బొల్లపెల్లి వీరారెడ్డి, బొల్లంపల్లి కుమారస్వామి, గనవేన శ్రీనివాస్, గుర్రాల భాస్కర్ రెడ్డి, కాశిరెడ్డి వసంత, జీఎం మారూపాటి రాంరెడ్డి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.