హనుమకొండ/హనుమకొండ చౌరస్తా, నవంబర్ 1: ప్రధాని మోదీ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు శాపంగా మారాయ ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమ వారం హనుమకొండలోని అమృత థియేటర్లో ‘రైతన్న’ చిత్ర నిర్మాత ఆర్ నారాయణమూర్తిని కలిశారు. రైతన్న సినిమా ద్వారా రైతుల ఇబ్బం దులను వెలుగులోకి తెచ్చిన ఆయనకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దయా కర్రావు మాట్లాడుతూ సామాజిక స్పృహతో ప్రజా సమస్యలను తన చిత్రాల ద్వారా చూపిస్తూ ప్రజలను చైతన్యపరిచే దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి సారథ్యంలో నిర్మించిన ‘రైత న్న’ సినిమాను అన్ని వర్గాలు ఆదరించాలని అ న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని అన్నారు. తెలంగా ణ రాష్ట్రంలో అన్నదాతకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిపే సినిమా రైతన్న అని, అందరూ చూడాలని కోరారు. అం బానీ, అదానీలకు దోచిపెట్టేందుకే కొత్త రైతు చట్టా లను తెచ్చారని ఆరోపించారు. ఎర్రబెల్లి దయా కర్రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతు సమస్యలపై పోరాడిన తీరు అద్భుతమని ఈ సం దర్భంగా ప్రశంసించారు. అనంతరం ఆర్ నారా యణ మూర్తిని మంత్రి సన్మానించారు.