చిల్పూరు, జూన్ 15 : ఈ టీచర్ మా కొద్దని నష్కల్ గ్రామస్తులు సోమవారం పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. చిల్పూరు మండలం నషల్ హైసూల్లో జ్యోతిలక్ష్మి కొంతకాలంగా ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నది. అయితే ఆమె తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండగా, విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, కిందిస్థాయి సిబ్బందితో అనవసర విషయాల్లో కలుగజేసుకొని వారితో వాగ్వాదానికి దిగేదని ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు.
వేసవి సెలవుల్లో జనగణన చేసే క్రమంలో నషల్ గ్రామానికి చెందిన ఒక ఇంటికి వెళ్లి, అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తున్న క్రమంలో మీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా ? వీళ్లు మీ తల్లిదండ్రులే కారు.. అంటూ ఆ విద్యార్థిని ప్రశ్నించింది. దీంతో ఆ విద్యార్థిని నాలుగైదు రోజులుగా నిద్రాహారా లు మాని నేనెవరో చెప్పాలని తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంది. విషయం తెలిసిన గ్రా మస్తులు జనగణనకు వెళ్లిన ఇంగ్లిష్ టీచర్ జ్యోతిలక్ష్మిని పాఠశాల పునఃప్రారంభం రోజు అడిగేందుకు పాఠశాలకు వెళ్లారు. అదే సమయంలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కోసం సర్పంచ్ రాజుయాదవ్, వార్డు సభ్యులను హెచ్ఎం పాఠశాలకు ఆహ్వానించింది.
ఈ క్రమంలో సర్పంచ్, గ్రామస్తుల సమక్షంలో ఇంగ్లిష్ టీచర్‌ను, ఆమె తీరును ప్రశ్నించడంతో ఆవేశానికి గురైన టీచర్ పుస్తకాలను గ్రామస్తుల పైకి విసిరి వేయడం, గ్రామస్తులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నవ్వడం, హెచ్ఎం సీట్లో కూర్చొని ‘నేనే హెచ్ఎం.. నాకెవరు ఎదురు చెప్పకూడదు’ అని పోలీసుల సమక్షంలోనే వింతగా ప్రవర్తించింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులు పాఠశాల ఎదుట నిరసనకు దిగా రు. ఈ టీచర్ మా కొద్దు అంటూ ఎంఈవో, డీఈవో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ రాజుయాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు, తోటి సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తిస్తున్న ఇంగ్లిష్ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను కోరారు.