చిట్యాల, ఏప్రిల్ 21 : తెలంగాణలో ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని దూతుపల్లి, లక్ష్మీపూర్ తండా, ఒడితల, పాసిగడ్డతండా, గోపాలపూర్, కొత్తపేట, జడలపేట, నైన్ పాక, వరికోల్ పల్లి, చైన్ పాక, అందుకుతండా, వెంచరామి, గిద్దముత్తారం, కాల్వపల్లి గ్రామాల్లో కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ..ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా అన్ని గ్రామాల్లో 27న పార్టీ జెండా ఆవిష్కరించి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు సభకు బయలుదేరాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు పిట్ట సురేష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శిలు ఏరుకొండ రాజేందర్, మడికొండ రవీందర్ రావు, పార్టీ మండల యూత్ అధ్యక్షుడు తౌటమ్ నవీన్, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు ట్రిమ్స్ తిరుపతి, నాయకులు కాట్రేవుల కుమార్, హరి భూషణ్, నిమ్మగడ్డ రాంబాబు, తొట్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.