హనుమకొండ (ఐనవోలు): రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు వెంకటాపురం విద్యార్థులు ఎంపికైన్నట్లుగా హెచ్ఎం డాక్టర్ టీ రమేశ్ తెలిపారు. మండలంలోని వెంకటాపురం జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎం హర్షవర్ధన్, ఎం రిషి, ఎం సంజయ్‌లు ఏప్రిల్ 27న జేన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన జూనియర్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీకుల పేర్కొన్నారు.
ఈ నెల 19 నుంచి 21వ తేది వరకు మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిర్వహించే 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొన్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రతిభకనబరిచి విద్యార్థులను, సహకరించిన పీడీ సుమలతను ఉపాధ్యయ బృందం అభినందించారు.