ఖిలావరంగల్: తెలంగాణ ప్రభుత్వ అసెంబ్లీ, స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదింప చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటిపాముల వెంకట రాములు అన్నారు. మంగళవారం బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే ఆమోదిస్తూ దేశవ్యాప్త కులజన గణన 2025 చేపట్టాలని కోరుతూ వరంగల్ కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చి తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
అలాగే 2025 లోనే దేశవ్యాప్త కుల జనగణన చేపట్టాలన్నారు. సర్వే ఆధారంగా బీసీల జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో విద్యా, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలనీ కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశామని తెలిపారు. 50శాతం రిజర్వేషన్లు మించరాదనీ సుప్రీం కోర్టు తీర్పు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదల పేరుతో 103వ రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మాదిరిగానే బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
బీసీలకు కేంద్ర కేబినెట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 20 లక్షల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన క్రింద బీసీలకు, దళితులకు పక్క ఇండ్ల నిర్మాణానికి రూ.10 లక్షల కేటాయించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాలను వెంటనే నిలిపివే యాలన్నారు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేఖ లేబర్ కోర్టులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శి వలబోజు వెంకన్న, చింతకింది కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు మేడిద అశోక్, చీకటి ప్రకాష్, చంద్రశేఖరాచారి, గొడిశాల రాజు, వలబోజు కృష్ణ, పెద్దోడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు