నల్లబెల్లి /నర్సంపేట, ఏప్రిల్ 23 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలి రావాలని బీఆర్ఎస్ పార్టీ మండల నేత బాల్నే వెంకన్న పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాలు మేరకు చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి, జీడిగడ్డ తండ, చెన్నారావుపేటలో సన్నాహాక సమావేశాలు నిర్వహించి వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 16 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలన్నారు.
గ్రామాలన్నీ ఒక్కటై ఒకే నినాదంతో ముందుకు సాగాలని, మన తెలంగాణ కోసం మళ్లీ కసితో ప్రతి వాడలోనూ ప్రతి పల్లెలోను ప్రజలు తరలివచ్చి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీపీ జక్కా అశోక్, మండల యూత్ ఇంచార్జి కంది కృష్ణ చైతన్య, మండల నాయకులు అనుముల కుమారస్వామి, సొసైటీ వైస్ చైర్మన్ వంశీ, మాజీ సర్పంచ్లు శ్రీధర్ రెడ్డి, కుండే మల్లయ్య, విజయరామరాజు, మాజీ ఎంపిటిసీ, విజేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు అందె వెంకటరాములు, కందకట్ల సాంబయ్య, కుసుమ నరేందర్, సాదు నర్సింగరావు, మూడు రమేష్, నామిడ్ల సురేష్, బోడ మురళి నాయక్, రసమల సతీష్, సాంబయ్య, సురేందర్ పాల్గొన్నారు.