Drugs | మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని అంధకారం చేసుకోవద్దని వేలేరు ఎస్సై అజ్మీర సురేష్ పేర్కొన్నారు. ఆదివారం మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమాలలో భాగంగా కస్తూర్భ గాంధీ పాఠశాలలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, వరంగల్ సీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని ఎక్కడైనా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వినియోగిస్తున్న వారి సమాచారాన్ని పోలీసులకు అందించి మత్తు పదార్థాలను నివారించడంలో సహకరించాలని కోరారు. ఈ డ్రగ్స్ నియోగించడం వల్ల నాడీ వ్యవస్థ పూర్తిస్థాయిలో క్షీణిస్తుంది అన్నారు. విపరీతమైన మత్తులో ఏదైనా నేరం చేయవచ్చు అని తెలిపారు. ఎవరైనా ఇలాంటి డ్రగ్స్ విక్రయించిన, వినియోగించిన పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు.