హనుమకొండ చౌరస్తా, మార్చి 28 : విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా చైత్ర పౌర్ణమి శనివారం 12వ తేదీన వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు భజరంగదళ్ కన్వీనర్ ఆదిత్య, విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి వి. రాజు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
వీర హనుమాన్ విజయాత్ర బైకు ర్యాలీ ప్రారంభంలో పదివేల మందితో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రంగసాయిపేట, మహంకాళి దేవాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై హనుమకొండ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం వద్ద సమావేశం అనంతరం హనుమాన్ హారతితో ముగుస్తుందన్నారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.