వర్ధన్నపేట, డిసెంబర్ 12 : మానసిక ప్రశాంతత, భక్తి భావాన్ని కలిగించే ఆలమాల అభివృద్ధి కృషి చేస్తామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే రమేశ్‌ను ప్రశాంతినగర్‌లోని ఆయన స్వగృహంలో కలిశారు.
ఆకేరువాగు ఒడ్డున శ్రీరాజరాజేశ్వరాలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయంలో ఈనెల 26న నిర్వహించనున్న ఆయ్యప్ప మండల పడిపూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎమ్మెల్యేను కోరారు. ఆయన స్పందించి నియోజకవర్గ స్థాయిలో ఇల్లంద అయ్యప్ప ఆలయ ఆవరణలో వర్ధన్నపేట, ఇల్లంద గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో మండల పడిపూజ, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆకేరువాగు ఒడ్డున రాజేశ్వర దేవాలయంతో పాటుగా అయ్యప్ప ఆలమ అభివృద్ధి కూడా తనవంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రధానంగా ఆలయ ఆవరణ చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు సహకారం అందిస్తానన్నారు. అలాగే పడిపూజా కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అయ్యప్ప భక్తులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఎంపీటీసీ గొడిశాల శ్రీనివాస్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ఎల్లస్వామి, ఇతర పార్టీల ప్రముఖులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.