ఇనుగుర్తి, జూన్ 28: ‘సాంస్కృతిక కళాకారిణి సట్ల అంజలి మృతి బాధాకరం. అంజలి చిన్న కుమార్తె మనస్విని ప్రస్తు తం 8వ తరగతి చదువుతున్నది. ఆమె చదువు బాధ్యత నేను తీసుకుంటున్నా’ అని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నా రు. మండల కేంద్రానికి చెందిన అంజ లి కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. రూ.10వేల ఆర్థిక సా యం అందజేశారు.
మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంజలి తెలంగాణ ఉద్యమ స మయంలో ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసిందన్నారు. అనంతరం చిన్ననాగారానికి చెందిన దళిత దివ్యాంగుడు చెడుపాక లక్ష్మణ్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు రాసిన లెటర్ ప్యాడ్‌ను లక్ష్మణ్‌కు అందజేయగా, సోమవారం కలెక్టర్‌కు అందిస్తానని బాధితుడు తెలిపారు. అలాగే ఇ టీవల అనారోగ్యంతో మృతిచెందిన శా గంటి లక్ష్మి, హనుమాండ్ల సోమిరెడ్డి, నెమలికండ్ల పుల్లమ్మ కుటుంబాలను ఎంపీ పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
కార్యక్రమంలో ఎంపీ సోదరులు వద్దిరాజు కిషన్, వద్దిరాజు దేవేందర్, వద్దిరాజు పెద్దవెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ డీకొండ వెంకన్న, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్‌రెడ్డి, మాజీ సర్పచ్‌లు దార్ల రామ్మూర్తి, గాయపు జయపాల్‌రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు బేతమల్ల చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి గం డు నాగన్న, నాయకులు పింగిళి శ్రీనివాస్, గాడుదుల రాజాలు, గుజ్జునూరి బాబురావు, నారాయణ ఉన్నారు.