నయీంనగర్, ఫిబ్రవరి 10 : పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈనెల 22, 23న జరిగే యూత్ పార్లమెంట్ ఫెస్టివల్-2023కు జిల్లాకు చెందిన వీ కృతికా ప్రియచందన్ ఎంపికయ్యారు. రాష్ట్ర స్థా యిలో జరిగిన ఉపన్యాస పోటీల్లో ప్రథమ బహుమతిని ఆమె గెలుచుకుంది. ‘ైక్లెమెట్ చేంజ్, డిజాస్టర్ రిస్క్’ అనే అంశం పై ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
ఇండియా జీ 20 ప్రెసిడెన్సీ అనే అంశంపై జరిగిన ఉపన్యాస పోటీ ల్లో ప్రతిభ కనబరిచి ఇటీవల హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ద్వితీయ బహుమతిని అందుకుంది.