Hindu Culture | హిందు సంస్కృతి రక్షణకు సంఘటితం కావాలి
Hindu Culture | హిందూ సంస్కృతి ( Hindu Culture) ని కాపాడుతూ సమాజ కల్యాణానికి హిందువులందరూ సంఘటితంగా కావాలని విశ్వబ్రహ్మ వీరధర్మస్వామి పిలుపునిచ్చారు.
న్యూశాయంపేట : హిందూ సంస్కృతి ( Hindu Culture) ని కాపాడుతూ సమాజ కల్యాణానికి హిందువులందరూ సంఘటితంగా కావాలని విశ్వబ్రహ్మ వీరధర్మస్వామి ( Veera Dharma Swamy ) పిలుపునిచ్చారు. ఆదివారం హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్లో న్యూశాయంపేట బస్తీ హిందూ సమ్మేళనం ( Hindu Sammelanam ) తాళ్లపల్లిశ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలను వదిలేసి మతం మారిన హిందూ బంధువులందరినీ తిరిగి పునరాగమనం చేయడానికి కృషి చేయాలన్నారు. విశ్వహిందు పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆకారపు కేశవరాజు మాట్లాడుతూ కాకతీయుల పౌరుష పరాక్రమాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి కుటుంబం హిందూధర్మ విలువలను పాటించాలని సూచించారు.
సమాజంలో జరుగుతున్న వికృతులను చర్చించి అటువైపునకు వెళ్లకుండా నేటి తరాలనుకాపాడుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి హిందూ ధర్మ రక్షణకు కదలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వీరమనేని రవీందర్ రావు, కోశాధికారి గుజ్జుల రాంచంద్రం, కీర్తి లక్ష్మయ్య, ఆర్ఎస్ఎస్ నాయకులు చిలకమారి సంజీవ, రమేష్, సంయోజక్ జూలపల్లి కరుణాకర్, మహిళా జర్నలిస్టు దేవికారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

