నర్సంపేట : ఉత్తరప్రదేశ్‌లోని లాఖిమ్పూర్లో రైతుల మృతికి కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రాను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. సోమవారం నర్సంపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నర్సంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. రైతు ఉద్యమంపై దాడి చేసి రైతుల మృతికి, తుపాకీ గుళ్లు కురిపించి, వాహనం కింద తొక్కించి రైతుల హత్యకు కారణమైన అజయ్ మిశ్రాపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులపై అమానుషమైన దాడిని చేశారని అన్నారు.
దీనిలో ఎనిమిది మంది రైతులు మృతి చెందడమే కాకుండా పలువురు రైతులు గాయపడ్డారని అన్నారు. మీటింగ్ స్థలం వద్ద నిరసన తెలిపి తిరిగి వెళ్తున్న రైతులపై మంత్రి కుమారుడు ఆశీష్ మిశ్రా తన అనుచరులు,గుండాలతో కలిసి కాలినడకన వెళ్తున్న రైతులపై అమానుషంగా వాహనాలను ఎక్కించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మండల ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, కొల్లూరి లక్ష్మీనారాయణ, రామ్‌ప్రసాద్, కుమారస్వామి, చంద్రమౌళి, నర్సయ్య, వంశీ, కృష్ణ, మోహన్‌రెడ్డి, హరీష్,క్రాంతి, రాజేందర్,రవి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఐఎఫ్టీయూ, ఏఎంఎస్, ఎంసీపీఐయూ పార్టీలకు చెందిన నాయకులు కూడా ప్రధాన మంత్రి దిష్టిబొమ్మను అంబేద్కర్ కూడలిలో దహనం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, రాజేందర్, నరేష్,వీరారెడ్డి,పెద్దారపు రమేష్, వెంకన్న, కుమార స్వామి , బాబురావు ,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.