మరిపెడలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గంట్ల శ్రీనివాస్‌రెడ్డి, ముదిరెడ్డి వీరారెడ్డి, మచ్చర్ల రాములుతోపాటు 300 మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మరిపెడలో బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో సుస్థిర పాలన సాధ్యమన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల కుంటల బలోపేతంతో కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. ఓటుకు నోటు దొంగను వెంటబెట్టుకొని తిరుగుతున్న ఢిల్లీ గులాంలు రాష్ర్టానికి అవసరం లేదన్నారు.
మరిపెడ, అక్టోబర్ 24 : డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మున్సిపల్ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గంట్ల శ్రీనివాస్‌రెడ్డి, ముదిరెడ్డి వీరారెడ్డి, మచ్చర్ల రాములుతోపాటు 300 మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మరిపెడలో బీఆర్ఎస్లో చేరగా, ఎ మ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే పురుషోత్తమాయగూడెంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుకున్నారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ మాట్లాడుతూ.. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ గులాంలకు స్థానం లేదన్నారు. సీఎం కేసీఆర్ సుభిక్షపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, విపక్ష పార్టీల అవసరం ఈ రాష్ర్టానికి లేదన్నారు. సీఎం కేసీఆర్ కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా మార్చినట్లు తెలిపారు. మత విద్వేషాలు లేకుండా సుస్థిరమైన పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. ఓటుకు నోటు దొం గను వెంటబెట్టుకున్న కాంగ్రెస్ నాయకత్వం రాష్ర్టానికి అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన హామీలపై ఏనాడు నోరెత్తని కాంగ్రెస్, బీజేపీకి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారికి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోని 4కోట్ల ప్రజలే బాస్‌లు అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అసమర్థపాలన కొనసాగుతున్నదని, అందుకు మణిపూర్‌లో జరుగుతున్న ఘటనలే నిదర్శమన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువై, స్థానికేతరులను వెతుక్కుంటున్న ట్లు తెలిపారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గంలోని గిరిజన తండాలు, మారుమూల పల్లెలకు తారురోడ్డు సౌకర్యం, మెరుగైన వసతులు కల్పించినట్లు తెలిపారు. మరిపెడవాసులకు మెరుగైన వైద్యం కోసం రూ.36కోట్లతో వంద పడకల వైద్యశాల, రూ.60 కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రగతిని చూసి బీఆర్ఎస్కు అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, మున్సిపల్ చైర్మన్ సిం ధూరాకుమారి, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చాపల యాదగిరిరెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, సర్పంచ్ నూకల అభినవ్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వరరావు, అనిరుద్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.