తాడ్వాయి/శాయంపేట, జనవరి 13 : బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంజర ఎల్లాపురం గ్రామ సమీపంలో శుక్ర వారం రాత్రి జరిగింది. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన కొందరు తాడ్వాయి మండలకేంద్రంలోని పీఏసీఎస్ నూతన భవనానికి పెయింటింగ్ వేసేందుకు వ చ్చా రు. శుక్రవారం సాయంత్రం పనులు ము గించుకుని పోగంటి వంశీ(23), ఎల్తూరి పవన్(22), మామిడి భాస్కర్ బైక్‌పై మండలంలోని గంగారం గ్రామానికి వ్యక్తిగత పని మీద వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణంలో బంజర ఎల్లాపురం సమీపంలోకి రాగా బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టుకు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన వంశీ, పవన్ అక్కడికక్కడే మృతిచెందగా, భాస్కర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు గమనించి అతడిని 108 వాహనంలో ములుగు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, తమకు న్యాయం చేయాలని పత్తిపాకలోని కాంట్రాక్టర్ పోతుగంటి సుధాకర్ ఇంటి మృతదేహాలతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పత్తిపాక-శాయంపేట ప్రధాన ర హదారిపై బైఠాయించారు. సీఐ మల్లేశ్, ఎస్సై దేవేందర్ వారికి సర్ది చెప్పడంతో ఆందోళన విర మించారు. పవన్, వంశీ కుటుంబాల్లో ఒక్క కొడుకులే కావడంతో ఆయా తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.