కాటారం, మే 22: భూపా లపల్లి-కాటారం 353(సీ) జాతీయ రహదారిపై గురువారం పుష్కరాల కు వెళ్తున్న ఆటో, కారు ఎదురెదురు గా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణి స్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గా యాలయ్యాయి. కాటారం ఎస్సై అభినవ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కొత్త చంద్రకాంత్, గుండ్ల శ్రీనివాస్, గుండ్ల సంతోషి, కాపర్తి రవీందర్, కాపర్తి జ్యోతి కారులో పుష్కరాలకు వచ్చి తిరిగి వెళ్తున్నారు.
చిట్యాల మండలం వరికోలుపల్లి గ్రామం నుంచి ఆటోలో నర్సింహ, పాల రజిత(32), శ్రీరాముల విష్ణు(22), అజీద్, వివన్, సంధ్య, శోభ, మణెమ్మ, పిల్లలు శాన్విత, విశృత్, మోక్షిత్ పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తున్నారు. జాతీయ రహదారిపై మేడిపల్లి టోల్గేట్ సమీపంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమా దంలో ఆటోలో ప్రయాణిస్తున్న విష్ణు(20), రజిత (32) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వాహనదారులు, స్థానికులు భూపాలపల్లి 100 పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ నాగార్జునరావు, ఎస్సైలు అభినవ్, గీతరాథోడ్ పరిశీలిం చి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం 100 పడకల ఆస్పత్రికి తరలించారు.