రాయపర్తి, నవంబర్ 20: మండలం లో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందా రు. కొండూరుకు చెందిన తెలంగాణ ఉ ద్యమకారుడు, బీఆర్ఎస్ మండల నాయకుడు పోల్నేని శ్యామ్రావు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గ్రామానికి చేరుకొని శ్యామ్రావు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అ నంతరం బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గుడిపూడి గోపాల్రావు, మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, కర్ర రవీందర్రెడ్డి, ఎండీ నయీం, పూస మధు, కోదాటి దయాకర్రావు, సత్యనారాయణరావు, సోమేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, వెంకన్న, పురుషోత్తం, బద్దం వేణుగోపాల్రెడి, రా జు ఉన్నారు. అలాగే, రాయపర్తిలోని రజక కాలనీకి చెందిన మచ్చ ఆండాలు(60) గుండెపోటుతో మృతి చెందింది.