Kyathanapalli | రణరంగంగా క్యాతనపల్లి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ.. పోలీసుల లాఠీచార్జి
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకుని మరోసారి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు కుట్రలు పన్నింది. నిన్న జనగామలో చేసినట్లుగానే బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికలో పాల్గొననివ్వకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు. చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళ్తున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆమెపై కేసు నమోదైందని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. దీంతో బాల్క సుమన్ మీద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. కాంగ్రెస్ దాడిపై బీఆర్ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

