వరంగల్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ టీఆర్ఎస్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బొంతల కుమారస్వామి, డీసీ తండాకు చెందిన భూక్య శ్రీను ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందారు. వారికి టీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉండడంతో పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే రమేష్ స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. అనంతరం ఇల్లంద గ్రామానికి చెందిన అడెల్లి కేశవరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 60వేల చెక్కును కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.