Spices | కరీమాబాద్, మార్చి 15 : పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం వరంగల్ లో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజన్న ఆధ్వర్యంలో ప్రారభించబడిన సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ వారి సాజన్యంతో తెలంగాణకు అనువైన సుగంధ ద్రవ్యాల సాగుపైన మూడు రోజుల శిక్షణ ముగిసింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి సంగీత లక్మి విశిష్ట అతిథిగా, సుగంధ ద్రవ్యాల సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ వి విజీష్ణ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ ముగిసిన రైతులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ ముగిసిన రైతులకు చివరి రోజున రైతులకు పసుపు, మిరప మరియు కూరగాయల విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉద్యాన అధికారిని సంగీత మాట్లాడుతూ.. రైతులు సాంప్రదాయ పంటలు కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని, ఈ పంటలను పంట మార్పిడిగా ఉపయోగించాలని, తక్కువ పెట్టు బడితో ఎక్కువగా లాభం వస్తుందని రైతులకు తెలిపారు. రాష్ట్రంలో సాగు విసుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యత, ఇతర దేశాలలో ఉన్న డిమాండ్ గురించి వివరించడం జరిగింది. సుగంధ ద్రవ్యాలకు ఇతర దేశాలలో ఉన్న డిమాండ్ ను రైతులు ఉపోగించుకొని కొత్త రకం పంటలు సాగు చేయాలని అలాగే సుగంధ ద్రవ్య సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న ఇతర స్కీమ్స్ గురించి ముఖ్య అతిథి విజిష్ణ రైతులకు సూచించారు. సుగంధ ద్రవ్యాల సంస్థ లో అమలు అవుతున్న సుగంధ శ్రీ పథకం ను ఉపయోగించు కోవాలని తెలియజేశారు.