హనుమకొండ చౌరస్తా, జూలై 30 : కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన 10 మంది బోధనేతర ఉద్యోగులు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జూలై 28 నుంచి 30 మధ్య నిర్వహించిన ‘ఓరియెంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఆఫీస్ ప్రొడక్టివిటీ’ అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ శిక్షణలో ఉద్యోగులు రోజువారీ కార్యాలయ పనితీరు, వేగం, ఉత్పాదకత, అవుట్ పుట్ పెంపుదలకు అవసరమైన వివిధ టెక్నిక్‌లు, టూల్స్, టెక్నాలజీ వినియోగం గురించి అవగాహన పొందారు. టెక్నాలజీ వాడకానికి సంబంధించిన ప్రయోజనాలు, సవాళ్లు, ఆచరణాత్మక పరిష్కారాలపై కూడా విస్తృతంగా చర్చించారు. పర్యవేక్షకులు కె.శ్రీనివాస్, బి.శ్రీనివాస్, ఎస్.కృష్ణమూర్తి, జూనియర్ అసిస్టెంట్లు బి.కల్పన, పి.శ్రీరాం, కె.ప్రవశిత్కుమార్, క్లర్క్-కమ్-టైపిస్ట్‌లు కె.రజిని, ఎన్.శివాజీగౌడ్, డి.సాయిప్రసాద్ ఉన్నారు.