సుబేదారి, ఏప్రిల్ 25 : ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధ రాత్రి వరకు మూడు ప్రధాన రూట్లలో వాహనాల దారి మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారులు, ప్రయాణికులు ఆయా మార్గాల్లోనే వెళ్లి పోలీసులకు సహకరించాలని ఏసీపీ కోరారు.
కరీంనగర్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు హుజురాబాద్ నుంచి వయా పరకాల క్రాస్ రోడ్డు, ఉప్పల్, కమలాపూర్, అంబాల, ముచ్చర్ల క్రాస్‌రోడ్, ఓఆర్ఆర్ ద్వారా రావాలి. హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ఇదే మార్గంలో ప్రయాణించాలి. సిద్దిపేట నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు జనగామ మీదుగా ప్రయాణించాలి. ఇదే మార్గంలో సిద్దిపేటకు వెళ్లాలి. హుస్నాబాద్ నుంచి వచ్చే వాహనాలు వయా ముల్కనూరు, కొత్తకొండ, వేలేరు, మల్లికుదుర్ల, క్యాతంపల్లి, పెద్దపెండ్యాల ద్వారా హనుమకొండకు చేరుకోవాలి. ఇదే మార్గంలో హుస్నాబాద్ వైపు వెళ్లాలి.