కాజీపేట, జూలై 03: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్సును ట్రాఫిక్ పోలీసులు తిరిగి అప్పగించిన సంఘటన గురువారం కాజీపేట పట్టణంలో జరిగింది. ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని డిమార్ట్ సమీపంలో విధులు నిర్వహిస్తున్న స్థానిక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్.కె అక్బర్ పాషా, రోడ్డుపై నడిచి వెళుతున్న మరో మహిళ కు రోడ్డుపై పర్సు దొరికింది.
పర్సు తెరిచి చూడడంతో అందులో ఆరువేల నగదు, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డులు, ఒరిజినల్ పాస్‌పోర్ట్ తదితర కార్డులు ఉన్నట్లు చెప్పారు. పర్సు హనుమకొండలోని గోకుల్ నగర్ చెందిన కమాని ప్రదీప్‌కు చెందినదిగా గుర్తించారు. వెంటనే ప్రదీప్ తండ్రి చంద్రయ్యకు తిరిగి పర్సును అప్పగించారని తెలిపారు. తిరిగి పర్సు అప్పగించిన ట్రాఫిక్ పోలీసులకు చంద్రయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.