బీఆర్ఎస్ సభకు వెళ్లే వాహనాలకు అడుగడుగునా ట్రాఫిక్ జామ్ ఎదురైంది. ఖమ్మం, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను పోలీసులు రింగ్‌రోడ్డు మీదుగా ఎల్కతుర్తికి తరలించారు. దీంతో దేవన్నపేట టోల్‌ప్లా జావద్ద సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పోలీసులు ముంద స్తు చర్యలు తీసుకోకపోవడం, టోల్ ప్లాజాలో సాంకేతిక సమ స్య రావడంతో వాహనాలు ఆగిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఐపీఎస్ మనన్ భట్ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
– మడికొండ, ఏప్రిల్ 27