ఖిలావరంగల్, జూన్ 02 : తెలంగాణ పర్యాటక శాఖ సైట్ గైడ్ల వేతనాలు పెంచి రెగ్యులైజేషన్ చేయాలని గైడ్ రవియాదవ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో టూరిజం శాఖలో రూ.600 అతి తక్కువ వేతనంతో మొదలై స్వరాష్ట్రంలో రూ.3900 వేతనం ఇస్తున్నారని తెలిపారు.
19 ఏళ్లుగా దేశ, విదేశాల నుంచి అనేక మంది పర్యాటకులకు సేవలందిస్తూ జిల్లా అధికారుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ పోషణ భారమై ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోలేక మానసికంగా కృంగి పోయి అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకొని రెగ్యులైజేషన్ చేయాలని వినతి పత్రంలో కోరారు.