Su From So Movie | కన్నడలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న ‘సు ఫ్రమ్ సో’ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 09 నుంచి తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. రాజ్ బి శెట్టి సహ-నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు జెపి తుమినాడ్ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రం, వినూత్నమైన కథాంశంతో కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఇదే సినిమాను తెలుగులో విడుదల చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. దక్షిణ కన్నడ ధర్మస్థలికి దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. గ్రామంలో నివసించే అశోక్ (జె.పి. తుమినాడ్) ఒక పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా, తాను ప్రేమించిన యువతి ఇంటి దగ్గర ఆగుతాడు. అదే సమయంలో ఆమె బాత్రూంలో నుంచి మాటలు వినిపించడంతో దొంగచాటుగా ఆమెను చూసేందుకు ప్రయత్నిస్తాడు. అయితే, అతనిని చూసిన ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడంతో, వారికి దయ్యం పట్టినట్లుగా డ్రామా చేసి అక్కడినుంచి తప్పించుకుంటాడు. తెల్లవారేసరికి అశోక్‌కు దయ్యం పట్టిందని ఆ ఊరిలో వార్త బాగా వ్యాపించిపోతుంది. దీంతో, అశోక్లోని దయ్యాన్ని వదిలించేందుకు గ్రామానికి చెందిన పెద్ద రవన్న (షానిల్ గౌతమ్) నగరంలో ఉన్న స్వామీజీ కరుణాజీ (రాజ్ బి శెట్టి)ని పిలిపిస్తాడు. నిజంగానే అశోక్‌కు దయ్యం పట్టిందా? కరుణాజీ స్వామీజీ దయ్యాన్ని వదిలించారా? దయ్యం పట్టినట్లుగా అశోక్ చేసిన డ్రామా వల్ల ఆ ఊరి ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
Recent #Kannada Blockbuster 🔥
#SufromSo streaming from September 9 on JioHotstar in Kannada, Telugu & Malayalam 🍿!!#OTT_Trackers pic.twitter.com/ih1X6VJitJ— OTT Trackers (@OTT_Trackers) September 6, 2025