హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 5 : వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) బజాజ్ ఆటో లిమిటెడ్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ సీఎస్ఆర్ నిధుల నుంచి రూ. 13 కోట్లు వెచ్చించి నిట్ క్యాంపస్‌లో సిల్ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ఎం వోయూపై సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గుడిపాటి సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు కలిగే విధంగా నైపుణ్యాభివృద్ధి చేయనున్నారు.
బెస్ట్ ప్రోగ్రాం మొత్తం ఆరు విభాగాలుగా రూపొందించగా, ఇందు లో ప్రథమ దశలో ఫర్మ్ వేర్ డెవలప్మెంట్, ఈ-మొబిలిటీ భాగాలను అమలు చేస్తున్నారు. ఈ బెస్ట్ ప్రోగ్రామ్ ఇప్పటికే నిట్‌లోని బీటెక్ (ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) కోర్సుల్లో సమీకరించారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు నిట్, బజాజ్ ఆటో నుంచి సంయుక్త సర్టిఫికెట్ పొందనున్నారు. అంతేకాకుండా, ఈ ప్రత్యేక విభాగాల కోసం అవసరమైన అన్ని పరికరాలు, ల్యాబ్ మౌలిక వసతు లు కంపెనీ పూర్తిగా స్పాన్సర్ చేయనుంది.
దీంతో విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రాక్టికల్, లెర్నింగ్ లభించనుంది. ఈ సందర్భంగా బిద్యాధర్ సుబుద్ధి మాట్లాడుతూ భారత ప్రభు త్వ ఉన్నత విద్యా కార్యదర్శి మార్గదర్శకత్వంలో బెస్ట్ ప్రోగ్రామ్ ప్రారంభించిన మొదటి నిట్ వరంగల్ అని తెలిపారు. బజాజ్ ఆటో లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ గుడిపాటి మాట్లాడుతూ విద్యార్థులను భవిష్యత్తుకు తగిన ఇంజినీర్లుగా తీర్చిదిద్దడంలో ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్ర మంలో నిట్ ప్రొఫెసర్ టీకిశోర్ కుమార్, డీన్స్, విభాగాధిపతులు, అధ్యాపకులు, బజాజ్ ఆటో లిమిటె డ్ ప్రతినిధులు పాల్గొన్నారు.