ఆత్మకూరు/రేగొండ, అక్టోబర్ 2 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన ఇటుకల నిర్మల (51), సొలెంక రమ (45)తో పా టు మరో ఎనిమిది మంది పత్తి ఏరేందుకు కూలీ పనికి వెళ్లారు. ఈ క్రమంలో ఉరుము లు, మెరుపులతో వాన మొదలవ్వడంతో ప క్కనే ఉన్న చెట్టు కింద నిర్మల, రమ నిల్చున్నా రు.
మిగతా వారు వేరే చోట ఉన్నారు. ఇదే సమయంలో చెట్టుపై పిడుగు పడడంతో ఇ ద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందా రు. నిర్మలకు ముగ్గురు కుమార్తెలు, భర్త రా జేందర్ ఉన్నారు. రమకు ఇద్దరు కుమారులు, భర్త మహేందర్ ఉన్నారు. అలాగే జయశంక ర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రం గయ్యపల్లెకు కారట్లుపెల్లి లక్ష్మి (49)భర్త నగేశ్‌తో కలిసి వ్యవసా య పనుల నిమిత్తం పొ లం వద్దకు వెళ్లింది.
పత్తి మొక్కలకు ఎరువు లు వేస్తున్న క్రమంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుండడంతో ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా పిడుగుపడడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందిం ది. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కూతు ళ్లు, కొడుకు ఉన్నారు. కాగా, విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మృతురాలి కుటుం బ సభ్యులను పరామర్శించారు.