కాశీబుగ్గ, నవంబర్ 13: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు మూడు రోజులు సెలవు ఇస్తున్నట్లు కార్యదర్శి పోలెపాక నిర్మ ల తెలిపారు. 15న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, 16న వారాంతపు యార్డు బంద్, 17న ఆదివారం సెలవు అని పేర్కొన్నారు. సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు య థావిధిగా కొనసాగుతాయని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మార్కెట్కు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు.