న్యూ శాయంపేట, ఆగస్టు 31 : శ్రీ హరిచంద్ర పరపతి సంఘం నూతన కార్యవర్గం ఎంపిక ప్రక్రియ పూర్తయింది. హనుమకొండ పద్మాక్షి రోడ్‌లోని మున్నూరుకాపు భవనంలో ఆదివారం సమావేశమైన సభ్యులు అధ్యక్షులుగా తోట ప్రకాష్ (Thota Prakash), ప్రధాన కార్యదర్శిగా కనుకుంట్ల రవికుమార్ (Kanukuntla Ravikumar)ను ఎన్నుకున్నారు.
సంఘం కోశాధికారిగా దొమ్మటి భాస్కర్ ఉపాధ్యక్షులుగా తుమ్మేటి బుచ్చిరాజు, సహాయ కార్యదర్శిగా మక్కల దేవదాస్ ఎంపికయ్యారు. ఆడిటర్‌గా దేవులపల్లి సంపత్, కార్యవర్గ సభ్యులుగా గిరి రాజయ్య, తోట శ్రీనివాస్, తుమేటి సదానందం, అరసం కృష్ణమూర్తి, గోదాసు శ్రీనివాస్‌లు ఎంపిక అయ్యారని సంఘం ప్రతినిధులు వెల్లడించారు.