ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతలా మారిపోయారో ఈ మధ్య వివిధ సందర్భాల్లో కనిపించిన ఆయన రూపం తెలియజేస్తున్నది. భారీ వర్కవుట్లతో సన్నగా మారిపోయారు ఎన్టీఆర్. ఈ సరికొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఇదిలావుంటే.. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొంతభాగం పూర్తయింది. గత రెండు నెలలుగా షూటింగ్‌కు విరామం ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. దాంతో సినిమాపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు ఆ ఊహాగానాలన్నింటికీ తెర దించుతూ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది.
ఈ షెడ్యూల్‌కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం కూడా బయటకొచ్చింది. ఇది పూర్తిగా నైట్ షెడ్యూల్. తారక్‌పై రాత్రిపూట సన్నివేశాలన్నింటినీ ఈ షెడ్యూల్లోనే తీస్తారట. 20రోజుల పాటు కేవలం రాత్రుళ్లు మాత్రమే జరిగే ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్‌తో పాటు కథలోని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారని తెలిసింది.
ఇవన్నీ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కి సంబంధించినవేనని టాక్. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్‌కపూర్, టోవినో థామస్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి.