ఖనిజాల ప్రాసెసింగ్‌పై మరిన్ని పరిశోధనలు చేయాలి
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్(ఐఐఎం) 79వ వార్షిక సాంకేతిక సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనున్నది.
- ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి
- ఐఐటీ హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
కంది, డిసెంబర్ 5 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్(ఐఐఎం) 79వ వార్షిక సాంకేతిక సమావేశంలో భాగంగా మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనున్నది. భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, యూఎస్ఎ, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా మెటీరియల్స్ సైన్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్ రంగాల్లో పెరుగుతున్న పరిశోధనా శక్తిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌పై పరిశోధనల వేగం పెంచాల్సిన అవసరం ఉందని, మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. టెక్నాలజీ పరంగా స్వయం సమృద్ధి చెందిన భారత భవిష్యత్తు వనరుల సేకరణ, ప్రయోజనం, కీలక మూలకాల జీవచక్రాన్ని అధిగమించే సామర్థ్యంపై ఆధారపడి ఉందన్నారు. సింగరేణి సీఎండీ ఎన్.బాలరామ్ మాట్లాడుతూ.. దేశంలో కీల క ఖనిజాల ఉత్పత్తిని బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. 45 సంస్థల నుంచి తయారు చేసిన ఆధునిక విశ్లేషణ పరికరాలు, తయారీ సాంకేతికతల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. వివిధ దేశాల ప్రతినిధులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

