హనుమకొండ రస్తా : నమస్తే తెలంగాణ( Namaste Telangana) వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి (Challa Venkateswar Reddy) డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలు వెలికితీస్తున్న నమస్తే తెలంగాణ పత్రికపై దాడి చేయడం అమానుషమని అన్నారు.
ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే పత్రికలపై దాడులు చేయడం, వాస్తవాలు ప్రచురిస్తే దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక ని అలాంటి పత్రికలపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పత్రిక నమస్తే తెలంగాణ అని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాపై బెదిరింపులుదాడికి దిగడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాస్తున్న క్రమంలో తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తే వివరణ ఇవ్వాలి కానీ బెదిరించడం, భౌతికంగా దాడులకు దిగడం, బావప్రకటన స్వేచ్ఛపై దాడులు చేయడం, ప్రజలకు మేలు చేసే పత్రికలపై దాడి చేయడం సరికాదన్నారు. దాడికి యత్నించినవారిని అందుకు సహకరించిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.