HCA Under-19 | హనుమకొండ చౌరస్తా, జూన్ 20: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యలో ఈనెల చివరి వారం నుంచి జరగనున్న హెచ్‌సీఏ అండర్- 19 లీగ్ పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికలో భాగంగా గ్రామీణ జిల్లా క్రికెటర్లను ప్రోత్సహిస్తూ 6 నుండి 19 వరకు జరిగిన అండర్-19 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పాల్గొన్న వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాద్ టోర్నమెంట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన 18 క్రీడాకారులను శుక్రవారం కరుణాపురంలోని వంగాలపల్లి క్రికెట్ మైదానంలో తుది జట్టును ఎంపిక చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా పాల్గొన్న ఈ టోర్నమెంట్ నుంచి అత్యంత ప్రతిభ కనబరిచిన బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా బి.సాత్విక్, బౌలర్‌గా శ్రీకాంత్, అల్‌రౌండర్‌గా ఎన్.మనీష్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ ఎంపికలో జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, శంకర్, పవన్ పాల్గొన్నారు.
జట్టు వివరాలు
బి.సాత్విక్, వి.ప్రీతేష్, పి.రంగారావు, ఓ.సుకుమార్, బి.దయానందు, జె.విశ్వక్సాయి, పి.శ్రీకాంత్, ఎం.మనీష్‌కుమార్, డి.మన్‌దీప్‌సింగ్, ఎం.పుజిత్, వి.అశ్విత్, బి.చరణ్, సి.జేశ్వంత్, బి.మనోజ్, కె.రిత్విక్, బి.వితేష్, ఎం.రామ్‌చరణ్, ఎం.రాణాచరణ్, స్టాండ్ బైస్‌గా ప్రవీణ్, పార్దిపన్, లక్ష్మణ్ ఉన్నారు.